నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫీసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సీల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గ్, హెరాల్డ్ హౌస్ లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీసును తాత్కాలికంగా సీల్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆఫీసులో సోదాలకు అక్కడి సీనియర్ ఆఫీసర్లు సహకరించకపోవడంతో ఆధారాలను ట్యాంపర్ చేయకుండా సీల్ చేశామని వెల్లడించారు.

ఈడీ అనుమతి లేకుండా ఆఫీసును ఎవరూ ఓపెన్ చేయరాదంటూ నోటీసును అతికించినట్లు చెప్పారు. యంగ్ ఇండియన్ ఆఫీసు తప్ప మిగతా నేషనల్ హెరాల్డ్ ఆఫీసు అంతా ఓపెన్ గానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఆఫీసు వద్ద, కాంగ్రెస్ చీఫ్​సోనియా గాంధీ ఇంటివద్ద భారీగా బలగాలను మోహరించారు.