ఈడీ స్వాధీనం చేసుకున్న విమానం వేలం..వచ్చిన మొత్తం ఫాల్కన్ స్కామ్ బాధితులకే

ఈడీ స్వాధీనం చేసుకున్న విమానం వేలం..వచ్చిన మొత్తం ఫాల్కన్ స్కామ్ బాధితులకే

హైదరాబాద్: శంషాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్వాధీనం చేసుకున్న విమానాన్ని వేలం వేయనున్నారు.  ఈ జెట్ ను వేలానికి పెట్టింది ఈడీ.  ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఉన్న ఈ విమానాన్ని కొనుగోలు దారులు పరిశీలించేందుకు అనుమతినిచ్చింది. 

ఈ జెట్ విమానం వేలం ప్రక్రియ డిసెంబర్ 9న MSTC Limited ద్వారా జరుగుతుందని తెలిపింది.  విమానం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం మోసం ఫాల్కన్ స్కామ్ కేసులో బాధితులకు చెల్లించనున్నట్లు ఈడీ ప్రకటించింది. 

రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ లో ప్రధాన నిందితుడు అయిన అమర్‌దీప్ కుమార్‌కు చెందినది ఈ హాకర్ 800A జెట్ (N935H) . ఫాల్కన్ గ్రూప్ నిధులనుంచి ఈ జెట్ కొనుగోలుకు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఫాల్కన్ స్కాంలో ప్రధాన నిందితుడు అమర్‌దీప్  కుమార్ ,అతని సహచరుడు జనవరి 22న దుబాయ్‌కు పారిపోయే సమయంలో శంషాబాద్‌లో దిగిన తర్వాత జెట్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. 

ఫ్రాడ్ఇన్ వాయిస్ డిస్కౌంటింగ్ ఇన వెస్ట్ మెంట్ స్కీమ్ ద్వారా ఫాల్కన్ గ్రూప్ ఇన్వెస్టర్లనుంచి రూ.1700 కోట్లు వసూలు చేసింది. సేకరించిన మొత్తంలో కేవలం రూ.850 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. దాదాపు 6979 కోట్లు మంది ఇన్వెస్టర్లకు చెల్లించకుండా మోసం చేశారు. 

ఫాల్కన్ సంస్థ చైర్మన్ అమర్‌దీప్ సహా  కీలక అధికారులు పరారీలో ఉన్నారు. ఫిబ్రవరి 15న సైబరాబాద్ పోలీసులు ఈ కుంభకోణానికి సంబంధించి పవన్ కుమార్ ఓదెల,ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి లను అరెస్టు చేశారు.

వేలంలో పాల్గొనడానికి MSTC లింక్:
MSTC/HYD/Directorate of Enforcement/3/Hyderabad/25-26/45608