
- చంద్రయాన్‌పై అవగాహన కల్పిస్తే చాలు: విద్యాశాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: చంద్రయాన్ 3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు బడులు తెరిచే ఉంచాలని ఇచ్చిన ఆదేశాలను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ఉదయం ప్రేయర్ టైంలో స్టూడెంట్లకు చంద్రయాన్3ని చూసేలా అవగాహన కల్పిస్తే చాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్లకు ప్రొజెక్టర్, కెయాన్ , టీవీల ద్వారా చూపించాలని సూచించారు. మిగిలిన స్టూడెంట్లకు ఇంటివద్దనే టీవీల్లో లేదా ఫోన్లలో చూసేలా అవగాహన కల్పించాలని చెప్పారు.