రాష్ట్రంలో విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి: ధర్మ టీచర్స్​ యూనియన్​

రాష్ట్రంలో విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి: ధర్మ టీచర్స్​ యూనియన్​

ఖైరతాబాద్​,వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధర్మ టీచర్స్​ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాక లింగమల్లు యాదవ్​ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా ఎమర్జెన్సీని ప్రకటించాలని కోరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఎంఈవో ,డీఈవో పోస్టులతోపాటు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం, టిఫిన్లలో నాణ్యత లోపించిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఇంటర్​నుంచి విద్యార్థులకు స్కిల్​డెవలప్​మెంటు కోర్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సలహాదారు కొండ ఆశన్న, ప్రధాన కార్యదర్శులు డి.ఉపేందర్​,బి.సుధాకర్, ఉపాధ్యక్షుడు పి.అశోక్​, ఎన్​.రమేశ్​తదితరులు పాల్గొన్నారు.