విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీ గుర్తించాలె

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీ గుర్తించాలె
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్టూడెంట్లలో సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అలాగే స్టూడెంట్లలో దాగి ఉన్న క్రియేటివిటీని గుర్తించి, వెలికితీసేందుకు టీచర్లు కూడా కృషి చేయాలని సూచించారు. శుక్రవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్డీలో నిర్వహించిన జాతీయ బాలశ్రీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టూడెంట్లలో ప్రతిభను వెలికితీసి భవిష్యత్‌‌‌‌‌‌‌‌ సైంటిస్టులుగా ఎదిగే మానవ వనరులను తయారు చేస్తున్నామని చెప్పారు. జాతీయ బాల భవన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన పలు పోటీల్లో 2015 , 2016 సంవత్సరాలకు గాను 10 మంది పిల్లలు రాష్ట్రం నుంచి ఎంపికవ్వడం గర్వకారణమన్నారు. స్టూడెంట్ల క్రియేటివిటీ ఆలోచనలు సమాజానికి ఉపయోగపడేలా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బాలభవన్‌‌‌‌‌‌‌‌ బాలశ్రీ పురస్కారానికి ఎంపికైన స్టూడెంట్లను సత్కరించారు.