గవర్నర్ అన్ని అనుమానాలను నివృత్తి చేస్తాం : సబితా ఇంద్రారెడ్డి 

గవర్నర్ అన్ని అనుమానాలను నివృత్తి చేస్తాం : సబితా ఇంద్రారెడ్డి 

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ప్రెస్ మీట్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇవాళ ఉదయం 11 గంటల  నుంచి గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించామని, అయితే.. రాజ్ భవన్  నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తమకు సమయం ఇస్తే గవర్నర్ అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. గవర్నర్ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు.

తనకు అవగాహన లేదని గవర్నర్ అన్నట్లు తెలిసిందని, గవర్నర్ అంత స్థాయి తనది కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తనకు అవగాహన లేకపోతే గవర్నర్ ను అడిగి తెలుసుకుంటానని చెప్పారు. త్వరలో పూర్తి సమాచారంతో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలపై మాట్లాడుతానని చెప్పారు.