నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి సబిత ఆగ్రహం

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి సబిత ఆగ్రహం

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంలో గత మూడేళ్లుగా ఇద్దరు మహిళా మంత్రులుగా తాను, సత్యవతి రాథోడ్ ఉన్నామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సేవలు చేస్తున్నామని చెప్పారు. నిజంగా మహిళల ప్రయోజనాల గురించి ఆందోళన చెందితే..ఆర్థికశాఖ మంత్రిగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించండి అంటూ కామెంట్స్ చేశారు. 

నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..?
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2018 వరకు మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తెలుగు భాషతో పాటు తెలంగాణను మర్చిపోతున్న టీఆర్ఎస్ దేశానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు.