
స్టూడెంట్స్‌కు మినిస్టర్ సబిత హామీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి సర్టిఫికెట్లు పాడైన స్టూడెంట్స్ టెన్షన్ పడొద్దని, కొత్త సర్టిఫికెట్లు ఇస్తామని ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు నీళ్లలో తడిసిపోయిన వారికి కొత్త సర్టిఫికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. సర్టిఫికెట్లు పాడైన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తే కొత్త సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తారని సబిత స్పష్టం చేశారు.