విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా చేసేది గురువులే..

విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా చేసేది గురువులే..

టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులందరికీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయులందరికీ మార్గదర్శనం అని ఆమె కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. బాధ్యత గల పౌరులుగా తయారుచేసేది గురువులేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం, మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. 100% అక్షరాస్యత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మౌలిక వసతులు పెరుగుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని ఆమె అన్నారు.