పోటెత్తిన వరద.. జలదిగ్భంధంలో ఏడుపాయల టెంపుల్

పోటెత్తిన వరద.. జలదిగ్భంధంలో ఏడుపాయల టెంపుల్

తెలంగాణలో గత నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.  జనజీవనం అస్తవ్యవస్థమయ్యింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి.ఊర్లకు ఊర్లు  మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. 

భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని ఏడుపాయల దగ్గర వరద పోటెత్తింది.  ఏడుపాయల వనదుర్గ టెంపు ల్ ను భారీ వరద ముంచెత్తింది.  ఏడుపాయల దగ్గర పరిసర ప్రాంతాల్లో అలర్ట్ విధించారు అధికారులు.  వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ALSO READ : పిల్లల ఆధార్ కోసం కొత్త మార్గదర్శకాలు

ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి.కామారెడ్డి మండలం టేక్రియాల్ చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో క్యాసంపల్లి దగ్గర 44వ జాతీయ రహదారికి భారీ గండి పడింది. రోడ్డు కుంగడంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.