కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ తీరుతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. గతంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు కోలాహలంగా జరిగేవని.. ప్రస్తుతం ఉద్యోగులు మీటింగ్ పెట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ను కేసీఆర్ రాచి రంపాన పెట్టారని ఆ శాఖ ఉద్యోగుల్ని సమాజంలో దోషులుగా నిలబెట్టారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కారణంగా ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్ మెంట్ అనాథలా మారిదని అన్నారు. కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని హెచ్చరించారు.

టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం