- తగ్గిన విజిటర్స్.. పరిమితంగా అనుమతి
హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్‌తో సెక్రటేరియెట్‌కు జనాల తాకిడి తగ్గింది. గత 3 నెలలుగా సీఎం, మంత్రులు, విజిటర్స్‌తో కిటకిటలాడిన సెక్రటేరియెట్‌లో ఇప్పుడు రాకపోకలు తగ్గాయి. కోడ్ ఉందని, ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయరని సందర్శకులు ఎవరు రావడం లేదు. ఎవరైనా వచ్చినా సెక్యూరిటీ లోపలికి అనుమతించడం లేదు. సీఎం, మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో బిజీ అయ్యారు.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోఉండడంతో అధికారికంగా రివ్యూలు చేసి.. ప్రభుత్వానికి సంబంధిం చిన కార్యక్రమాలను హైలెట్ చేసే అవవకాశం లేదు. దీంతో సీఎం, మంత్రులు ఎవరు సెక్రటేరియెట్‌కు రావడం లేదు.
