టీఎస్సీఎస్సీ గ్రూప్ 2,3 లో అదనపు పోస్టులు.. సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు

టీఎస్సీఎస్సీ గ్రూప్ 2,3 లో అదనపు పోస్టులు.. సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు

టీఎస్‌పీఎస్సీ 2022 గ్రూప్‌-2, గ్రూప్‌- 3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గ్రూప్‌-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

2022 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో కటాఫ్‌ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వ నున్నదని తెలిసింది. 2022 డిసెంబర్‌ 30న విడుదలైన గ్రూప్‌ -3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా గ్రూప్‌-3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి.