లైంగిక వేధింపులు.. ఇఫ్లూలో విద్యార్థుల ఆందోళన

లైంగిక వేధింపులు.. ఇఫ్లూలో విద్యార్థుల ఆందోళన

ఓయూ సమీపంలోని ఇఫ్లూలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. లైంగిక వేధింపుల బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇఫ్లూ గేట్ బయట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇఫ్లూ విసికి వ్యతిరేకంగా  విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 

దీంతో  ఓయూ పోలీసులు భారీగా చేరుకుని.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు  తరలించారు. ఇఫ్లూ విద్యార్థుల ఆందోళనకు ఎన్ఎస్యూఐ మద్దతు తెలిపింది.ఇఫ్లూ గేట్ లోపల ఇంకా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.