నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం..ఆరు నెలల్లో ఎన్నికలు

నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం..ఆరు నెలల్లో ఎన్నికలు

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ శుక్రవారం (సెప్టెంబర్12)ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కీ రికార్డు సృష్టించారు. ప్రధానమంత్రి పదవికి పోటీదారులుగా ఉన్న కుల్మాన్ ఘీసింగ్, సుడాన్ గురుంగ్ లతో సహా పలువురు కేబినెట్ మంత్రులుగా సుశీల కర్కీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అధికారం తాత్కాలిక ప్రభుత్వానికి కల్పించారు. 

నిరసనకారులు, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్,అధ్యక్షుడు రామ్ చంద్ర పౌదేల్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత 73 ఏళ్ల సుశీలా కర్కిని తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటును రద్దు చేసి తాత్కాలిక ప్రధానిగా కర్కీని నియమించాలని నిరసనకారుల డిమాండ్లను ఆమోదించారు.

సుశీల కర్కి కేబినెట్ మంత్రులు

కర్కితో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ ఆర్మీ మాజీ జనరల్ బాలానంద శర్మ పౌడెల్ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కుల్మాన్ ఘిసింగ్ జల వనరులు,విద్యుత్ మంత్రిగా వ్యవహరిస్తారు. ఓం ప్రకాష్ ఆర్యల్ న్యాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హమీ నేపాల్ వ్యవస్థాపకుడు సుడాన్ గురుంగ్ కు సమాచార, ప్రసార మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.

►ALSO READ | ఓట్ చోరీ ఇలాగే కొనసాగితే.. ఇండియాలోనూ నేపాల్ పరిస్థితి తప్పదు: అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు