
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా అందరికీ VoNR సర్వీస్ ప్రారంభించింది. మీరు జియో సిమ్, 5G ఫోన్ వాడుతున్నట్లయితే మీ ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి మీరు ఈ సర్వీస్ ఆన్ చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త సర్వీస్ ఏంటి, దీని వల్ల ఉపయోగం ఏంటి, ఎవరు ఈ సర్వీస్ పొందొచ్చు అంటే...
VoNR అంటే ఏమిటి: VoNR అనేది వాయిస్ ఓవర్ 5G/న్యూ రేడియో. ఈ టెక్నాలజీ జియో స్వంత టెక్నాలజీ, ఇది 5Gలో HD వాయిస్ కాల్స్ సేవలను, ఫాస్ట్ ఇంటర్నెట్ అందిస్తుంది.
VoLTE వర్సెస్ VoNR: VoNR vs VoLTE మధ్య ఉన్న తేడా ఏమిటంటే VoNR పూర్తిగా 5G నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది, VoLTE అనేది 4G నెట్‌వర్క్ టెక్నాలజీ. మీరు VoLTE ద్వారా కాల్స్ చేస్తే దీనికి 4G LTE నెట్‌వర్క్ అవసరం. VoNRలో మీ కాల్స్ 4g నెట్‌వర్క్ నుండి కాకుండా నేరుగా 5G నెట్‌వర్క్ ద్వారా వెళుతుంది. VoNR అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే కాల్స్ వేగంగా కనెక్ట్ అవుతాయి ఇంకా వాయిస్ క్వాలిటీ చాల స్పష్టంగా ఉంటుంది, కాల్స్ ఒకోసారి డిస్‌కనెక్ట్ అయ్యే సమస్య ఉండదు. VoNR వాడడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా తక్కువగా వినియోగిస్తుంది.
ALSO READ : ఆగస్టులో ట్రెండ్ మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్..
దీన్ని ఎలా ఆన్ చేయాలి: మీరు 5G ఫోన్, జియో సిమ్ ఉపయోగిస్తే ఈ సర్వీస్ ఈజీగా ఆన్ చేయవచ్చు. మీ ఫోన్‌లో VoNR సర్వీస్ ఆన్ చేయడానికి ముందు ఫోన్ సెట్టింగ్‌కు వెళ్లి మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లపై నొక్కండి. మీ ఫోన్‌లో జియో సిమ్ ఉంటే VoNR అప్షన్ చూస్తారు. డిఫాల్ట్‌గా ఈ అప్షన్ ఆఫ్ చేసి ఉంటుంది. మీరు దీన్ని ఆన్ చేసిన వెంటనే, మీ ఇంటర్నెట్ కొన్ని సెకన్ల పాటు కట్ అవుతుంది. ఆ తర్వాత మీ సిగ్నల్‌తో పాటు VoLTEకి బదులుగా Vo5G అని చూపిస్తుంది.
VoNR కనిపించకపోతే ఎం చేయాలి: మీ ఫోన్‌లో VoNR కనిపించకపోతే మీ ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. తర్వాత, మీ ఫోన్‌లో VoNR సర్వీస్ కనిపిస్తుందో లేదో చెక్ చేయండి.
ఎంత ఖర్చు అవుతుందంటే : కంపెనీ ఈ VoNR సర్వీస్ ఫ్రీగా ఇస్తుంది. దీనికోసం మీరు ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు 5G ఫోన్, జియో సిమ్, రూ. 239 రీఛార్జ్ చేసుకొని ఉండాలి.
ఎవరికి ప్రయోజనకరం: మీరు 5G ఫోన్ వాడుతూ, జియో సిమ్ ఉంటే, ఈ సర్వీస్ మీకోసమే... ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు దీని వల్ల మీకు స్పష్టంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ చాల వేగంగా ఉంటుంది.