Gold Rate: శుక్రవారం పెరిగిన గోల్డ్-సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లివే..

Gold Rate: శుక్రవారం పెరిగిన గోల్డ్-సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లివే..

Gold Price Today: ప్రస్తుతం బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ పతనం వంటి ఆర్థిక కారకాలు ఉన్నాయి. అలాగే పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో పెరిగే డిమాండ్ వంటివి ఇతర కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటివి పెట్టుబడిదారులు బంగారం వైపు చూసేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ బులియన్ ర్యాలీ ఇంకెన్నాళ్లంటూ గందరగోళంలో ఉన్నారు. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 11తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 12న రూ.770 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.77 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 12న):

హైదరాదాబాదులో రూ.11వేల 128
కరీంనగర్ లో రూ.11వేల 128
ఖమ్మంలో రూ.11వేల 128
నిజామాబాద్ లో రూ.11వేల 128
విజయవాడలో రూ.11వేల 128
కడపలో రూ.11వేల 128
విశాఖలో రూ.11వేల 128
నెల్లూరు రూ.11వేల 128
తిరుపతిలో రూ.11వేల 128

ALSO READ : అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యం రెన్యువల్

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 11తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 12న 10 గ్రాములకు రూ.70 పెరుగుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 12న):

హైదరాదాబాదులో రూ.10వేల 200
కరీంనగర్ లో రూ.10వేల 200
ఖమ్మంలో రూ.10వేల 200
నిజామాబాద్ లో రూ.10వేల 200
విజయవాడలో రూ.10వేల 200
కడపలో రూ.10వేల 200
విశాఖలో రూ.10వేల 200
నెల్లూరు రూ.10వేల 200
తిరుపతిలో రూ.10వేల 200

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 12న కేజీకి వెండి సెప్టెంబర్ 11తో పోల్చితే రూ.2వేల 100 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 42వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.142 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.