అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యం రెన్యువల్

అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యం రెన్యువల్

అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ తమ కో–-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు భాగస్వామ్యాన్ని రెన్యువల్ చేశాయి. ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి ఈ కార్డుతో చేసే అంతర్జాతీయ లావాదేవీలపై ఫారెక్స్ మార్కప్​ చార్జీ 1.99 శాతానికి తగ్గుతుంది. గతంలో ఇది 3.5 శాతం ఉండేది. ఈ కార్డు అమెజాన్​లో షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రైమ్​ సభ్యులకు 5శాతం అపరిమిత క్యాష్​బ్యాక్​, నాన్-ప్రైమ్​ సభ్యులకు 3శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. ఈ క్రెడిట్​ కార్డుకు వార్షిక, జాయినింగ్​ ఫీజులు ఉండవు.  అమెజాన్​లో కొంటే 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది.

ఈ నెల 18 నుంచి ఫార్మా ప్రో 2025

లైఫ్​సెన్సెస్​, ఫార్మా కంపెనీల కోసం ఈ నెల 18–20 తేదీల మధ్య హైదరాబాద్​లో హైటెక్స్​ ఎగ్జిబిషన్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనలిటికా ల్యాబ్​ ఇండియా, ఫార్మా ప్రో&ప్యాక్​ 2025 నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెటర్​ రవీంద్ర జడేజా ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.  650కి పైగా ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేర్​ పెవిలియన్​, ఇన్నోవేషన్​ లాంచ్​ప్యాడ్​, అంతర్జాతీయ పెవిలియన్స్​, వివిధ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. ఈ సమావేశాలలో ఇంటెలిజెంట్​ ల్యాబ్​, ఫార్మా 2030, అనలిటిక్స్​ అడ్వాంటేజ్​ వంటి అంశాలపై చర్చలు జరుపుతారు.

స్లీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్ ఇన్​సెన్స్​ స్టిక్స్​లో హానికర రసాయనం

 స్లీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్​ దోమల నివారణ అగరుబత్తీలలో మెపర్​ఫ్లుత్రిన్​ అనే అక్రమ రసాయనం ఉన్నట్లు గుర్తించామని హోమ్​ ఇన్‌‌‌‌సెక్ట్​ కంట్రోల్​ అసోసియేషన్ ప్రకటించింది. ఈ రసాయనం ఉపయోగించడానికి కేంద్ర క్రిమిసంహారక బోర్డు, రిజిస్ట్రేషన్​ కమిటీ ఆమోదం లేదని తెలిపింది.  ఆశికా ఇన్​సెన్స్ దీనిని తయారు చేస్తోందని హెచ్ఐసీఏ తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన దోమల నివారణ ఉత్పత్తులపై సీఐఆర్ నంబర్​ ఉంటుందని, దానిని చూసి మాత్రమే కొనుగోలు చేయాలని హెచ్ఐసీఏ కార్యదర్శి జయంత్​ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే సూచించారు.  

నవంబర్​ 25 నుంచి పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్​

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నవంబర్​ 25 నుంచి మూడు రోజుల పాటు హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్​ పౌల్ట్రీ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ మ్యానుఫ్యాక్చరర్స్​ అసోసియేషన్ తెలిపింది.   ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోను "వన్​ నేషన్​, వన్​ ఎక్స్​పో" థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. నవంబర్​ 25న నాలెడ్జ్​ డేతో ఈవెంట్​ ప్రారంభమవుతుంది. ఈ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్లు, 50వేల మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని ప్రకటించింది.