గుడ్లు తింటే గుండె పదిలం…

గుడ్లు తింటే గుండె పదిలం…

గుడ్లు తింటే హృదయసంబంధమైన రోగాలకు దూరంగా ఉండవచ్చని చెప్తున్నారు పరిశోదకులు. చైనీస్ అకాడెమీ ఆఫ్ మెడికల్ సైంటిస్ట్ పరిశోధకులు చేసిన అద్యాయనంలో… ప్రాచీనకాలంనుంచి గుడ్లను ఆహారంగా తీసుకుటున్నారని చెప్పారు. ఇవి మానవశరీరానికి కావలసిన ప్రోటీన్‌ను అందచేస్తాయని తెలిపారు. ప్రతీ వారం రెండుసార్లు గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. మనచుట్టూ ఉండే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లతో తక్కువ ధరకు దొరికేవి కేవలం గుడ్లేనని, ఇది అనేక విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయని చెప్పారు.

హృదయ సంబంధమైన రోగాలు రాకుండా ఉండటానికి గుడ్లు ఉపయోగపడతాయని అంటున్నారు పరిశోధకులు. అధ్యయనం ప్రకారం గుడ్డు వినియోగం మరియు హృదయ సంబంధమైన వ్యాధుల( CVD )కు లింక్ ఉందని తెలిపారు. వారానికి మూడు నుంచి ఆరు గుడ్లు తినేవారికి గుండెరోగాలు ఎక్కువగా రావని తెలిపారు.  CVD  ఉపకరాలలో గుడ్డువినియోగం యొక్క ప్రభావం వైవిధ్యంగా ఉందని పరిశోధకులు తెలిపారు.