ఇమ్యూనిటీ పవర్ కోసం కోడిగుడ్ల పంపిణీ

ఇమ్యూనిటీ పవర్ కోసం కోడిగుడ్ల పంపిణీ

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: లాక్ డౌన్ స‌మ‌యంలో కూర‌గాయ‌లు, నిత్య‌వ‌స‌ర స‌రుకులు, అన్న‌దానం, మాస్కులు పంపిణీ చేస్తున్న దాత‌ల‌ను ఎంతో మందిని చూశాం. కానీ పేద‌ల‌కు కోడిగుడ్లు పంపిణీ చేసిన సంఘ‌ట‌న గురువారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో జ‌రిగింది. కోడిగుడ్లు మ‌నిషికి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచుతాయ‌ని.. ఈ క్ర‌మంలోనే పేద‌ల‌కు కోడిగుడ్లు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిరపారు దాత‌లు. రెక్కాడితేగానీ డొక్కాడ‌ని నిరుపేద‌లు ఇబ్బందులతో ఉన్నందును శివ కృష్ణ ఫౌండేషన్, ఇండో ఇంఫ్రా డవలపర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు. ఈ రెండు పౌండేష‌న్స్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, గొల్నేపల్లిలో కోడిగుడ్లు పంపిణీ చేశారు.

ఈ కరోనా సమయంలో మనిషి ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు కోడిగుడ్డు కీలకంగా పనిచేస్థాయని.. దీంతో కోడిగుడ్లు పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలిపారు. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి ప్రతీ రోజు ఇలా వివిధ ప్రాంతాలలో కూరగాయల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నామ‌ని.. ఈ రోజు గోల్నేపల్లిలో కోడిగుడ్ల పంపిణీ కార్య‌క్ర‌మ‌ నిర్వహించినట్లు తెలిపారు. నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌తో పాటు కోడిగుడ్లు, పండ్లు పంపిణీ చేయ‌డానికి దాత‌లు ముందుకు రావాల‌న్నారు.