బంగారు కొనుగోళ్లపై మోదీ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ ప్రకటనలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిన విషయం తెలిసిందే. ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ భారతీయులను కోరడంతో మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గోల్డ్ బిజినెస్ పై ఆధారపడిన కోట్లాది మంది జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని 3.5 కోట్ల జీవనోపాధులకు ముప్పు వాటిల్లుతుందని ఏఐజేజీఎఫ్ హెచ్చరించింది, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని పరిశ్రమ కోరుతోంది.
బంగారం కొనుగోలుపై ప్రధాని మోదీ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ విజ్ణప్తిని ఆచరణలో పెట్టడం, దాని ప్రభావంపై చర్చలు, ఆందోళనలు పెరిగాయి. ఇరాన్ అమెరికా యుద్దం కారణంగా గణనీయంగా తగ్గిన భారత విదేశీ మారక విలువలు తగ్గడం, దీనిని అరికట్టేందుకు ప్రధాని మో దీ ప్రకటన ఓ కీలక చర్యగా భావిస్తున్నప్పటికీ భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉంటుందని బంగారం పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది మంది నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది 3.5 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ముప్పు కలిగించవచ్చని ఆల్ ఇండియా జ్యువెలర్స్ & గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (AIJGF) చెబుతోంది.
ఇలాంటి గడ్డు పరిస్థితులలో ఓవైపు లక్షలాది మంది ప్రజల జీవనోపాధి బంగారం దిగుమతులపై ఆధారపడి ఉండగా.. మరోవైపు బంగారం దిగుమతికి విదేశీ మారక నిల్వలను ఖర్చు చేసే స్థితిలో ప్రభుత్వం లేనందున బంగారాన్ని నగదుగా మార్చే పథకంతో ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ పథకమే గోల్డ్ మానిటైజేషన్ స్కీం.
గోల్డ్ మానిటైజేషన్ స్కీం..
గోల్డ్ మానిటైజేషన్ స్కీం 2015లో ప్రారంభించింది మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు బంగారం దిగుమతిని అడ్డుకోవడం, భారతీయుల దగ్గర నిరుపయోగంగా ఉన్న నిల్వ ఉన్న బంగారాన్ని వెలికి తీయడం వంటి రెండు అంశాలను దృష్టి పెట్టుకొని ఓ ప్రత్యా్మ్నాయ మార్గంగా భావిస్తున్నారు.
ఈ స్కీంలో భాగంగా ప్రజలు, సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సేకరించి ఉత్పాదక ప్రయోజకోసం ఉపయోగించేలా చేయడం, బంగారం దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రెండు రకాల స్కీంలు ఉన్నాయి. ఒకటి బంగారం డిపాజిట్ పథకం, రెండోది బంగారు లోహ రుణం. అప్పట్లో బంగారం సేకరించేందుకు ఇది ఒక గొప్ప ప్రయత్నంగా భావించబడినప్పటికీ, వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమైంది. దేశ ప్రజలనుంచి 34వేల టన్నుల బంగారం సేకరించాలని టార్గెట్ పెట్టుకోగా కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సమీకరించగలిగింది.
2026 ఆర్థిక సంవత్సరంలో మన బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆ అయిదు నెలల కాలంలో 24 శాతం పెరిగాయి. దీంతో దేశానికి సుమారు 72 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నష్టం వాటిల్లింది. దీంతో విదేశీ మారకం నిల్వ తగ్గుదలను అడ్డుకునే యోచనలో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీం తెరపైకి వచ్చింది.
పదేళ్లపాటు అమలులో ఉన్న ఈ స్కీంలో కొంత భాగం నిలిపివేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీంను పునరుద్దరించి బలోపేతం చేయాలని బంగారం పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరే యోచనలో ఉన్నట్లు మనీ కంట్రోల్ రిపోర్టులు చెబుతున్నాయి.
