Prabhas: డార్లింగ్ అంటే ఆమాత్రం ఉండాలి.. సైలెంట్‌గా ‘పెద్ద మనసు’ చాటుకున్న రెబల్ స్టార్!

 Prabhas: డార్లింగ్ అంటే ఆమాత్రం ఉండాలి.. సైలెంట్‌గా ‘పెద్ద మనసు’ చాటుకున్న రెబల్ స్టార్!

‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసి, గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నటుడు రెబల్ స్టార్ ప్రభాస్.  ఇప్పుడు వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన ‘రాజసం’ చాటుకుంటున్నారు.. స్పాట్‌లైట్‌కు దూరంగా ఉంటూ ప్రభాస్ చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ గెస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్నా, ఆఫ్-స్క్రీన్‌లో ఆయన ఎంత సింపుల్ అండ్ లవ్లీ పర్సన్ అనేదానికి ఈ లేటెస్ట్ ముచ్చటే నిదర్శనంగా నిలుస్తోంది.

‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్ల పాటు తన జీవితాన్ని అంకితం చేసేశాడు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ఆ భీకరమైన కండల వీరుడిలా కనిపించడం కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. దీనికోసం విదేశాల నుంచి దాదాపు రూ. 1.5 కోట్లు విలువచేసే వరల్డ్ క్లాస్ జిమ్ ఎక్విప్‌మెంట్‌ను ప్రత్యేకంగా తెప్పించి, తన ఇంట్లోనే ఒక ఇంటర్నేషనల్ జిమ్‌ను సెటప్ చేసుకున్నారు. డైలీ 6 గంటల కఠినమైన వర్కవుట్లు, 40 కోడిగుడ్లతో కూడిన హై-ప్రోటీన్ డైట్.. ఇలా ప్రభాస్ చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బెంచ్‌మార్క్ నిలిచింది..

అయితే, సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఆ కాస్ట్లీ జిమ్ ఎక్విప్‌మెంట్‌ను ప్రభాస్ ఏం చేశాడో తెలుసా? ఇక్కడే డార్లింగ్ తన ‘బంగారు మనసు’ చాటుకున్నాడు.అడ్వాన్స్‌డ్ ఫెసిలిటీస్ కొనుక్కోలేని, ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది వర్ధమాన అథ్లెట్లు, బాడీబిల్డర్ల కోసం ఒక స్పోర్ట్స్ ఆర్గనైజేషన్‌కు ఆ జిమ్ సామాగ్రి మొత్తాన్ని సైలెంట్‌గా డొనేట్ చేసేశారు. ఎక్కడా ప్రచారం ఆశించకుండా, ఎటువంటి హడావుడి లేకుండా డార్లింగ్ చేసిన ఈ దానగుణం ఇప్పుడు ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. షూటింగ్ సెట్స్‌లో వందల మందికి రోజూ బిర్యానీలు తినిపించే ప్రభాస్, కెరీర్‌ను మలుపు తిప్పిన జిమ్ ఎక్విప్‌మెంట్‌ను కూడా ఇలా ఇతరుల ఎదుగుదల కోసం ఇచ్చేయడం ఆయన రాజసం లోని అసలైన నైజం కనిపిస్తోందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రెసెంట్ ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ, క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi), మరియు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ఊరమాస్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మరిన్ని సునామీలు సృష్టించడం ఖాయం! అందుకే అంటారు.. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఎందుకంటే ఆయన డార్లింగ్.. అందరి హృదయాలను దోచేసే కింగ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.