ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఉన్న ఈ టవర్‌కు ఆగస్టు 12వ తేదీ శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. భారత కాలమానం ప్రకారం మధ్యా1: 30 గంటలకు దుండగులు ఫోన్ చేసి ఈఫిల్ టవర్‌ను కూల్చేందుకు బాంబు పెట్టామని బెదిరించారు.
దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకులను ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టవర్‌తో పాటు దాని చుట్టు పక్కల వున్న దుకాణాలను మూయించి, ఆ ప్రాంతం నుంచి అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపుతో ప్యారిస్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి.. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈఫిల్ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత అంటే 1889 మార్చి 31వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి అయింది. తొలి ఏడాదిలో 20 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. 2022లో 62 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించడం విశేషం.
