చౌమహల్లా ప్యాలెస్ లో ముకరం ఝా భౌతికకాయం

చౌమహల్లా ప్యాలెస్ లో ముకరం ఝా భౌతికకాయం

టర్కీలో కన్నుమూసిన 8వ నిజాం ముకరం ఝా భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. చార్టెడ్ ఫ్లైట్ లో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న  భౌతికకాయాన్ని అక్కడి నుంచి నేరుగా చౌమహల్లా ప్యాలెస్ కు తరలించారు. నిజాం కుటుంబసభ్యులు, సన్నిహుతులు, సిబ్బంది ముకరం ఝాకు నివాళుర్పిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్ లోకి జనాన్ని అనుమతించనున్నారు. 

సాయంత్రం 4గంటలకు భౌతికకాయాన్ని చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదుకు తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ నిర్ణయించింది. అధికార యంత్రాంగం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.