ఎనిమిదో నిజాం నవాబ్ మృతి

ఎనిమిదో నిజాం నవాబ్ మృతి

ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయాలని బహదూర్ చివరి  కోరిక కావడంతో ఆయన భౌతికకాయాన్ని టర్కీ నుంచి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. ఈ నెల 17న  హైదరాబాద్కు ఆయన  పార్ధీవ దేహం రానుంది. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రజల సందర్శననార్ధం చౌమల్లా ప్యాలెస్లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అసఫ్ జాహీ కుటుంబసభ్యుల సమాధుల మధ్య ముఖరం జా ను ఖననం చేస్తారు.