మీకంటే తెలివైన బుర్రలు(బ్రెయిన్).. అన్లైన్లో అమ్మకాలు.. ఎగబడి కొంటున్న జనం

మీకంటే తెలివైన బుర్రలు(బ్రెయిన్).. అన్లైన్లో అమ్మకాలు.. ఎగబడి కొంటున్న జనం

బీజింగ్: ఆన్‌‌లైన్ లో మనకు కొత్త, పాత వస్తువులు ఎన్నో దొరుకుతాయి. కానీ తాము మనిషి మెదడు కెపాసిటీని పెంచే వర్చువల్ బ్రెయిన్ ను అమ్ముతున్నామంటూ చైనాకు చెందిన ఓ కంపెనీ జోరుగా ప్రచారం చేసుకుంటోంది. తమ బ్రెయిన్ కొన్న వాళ్లు  స్టీన్ అంత తెలివిగా మారిపోతారంటూ ఊదరగొడుతోంది. దీంతో ఇప్పటికే 20 మంది ఈ వర్చువల్ బ్రెయిన్ ను కొనుగోలు చేశారట. 

 మెడిసిన్ కాదు, చిప్‌‌ కాదు

 చైనాలోని టావోబావో అనే ఆన్‌‌లైన్ షాపింగ్ పోర్టల్ ఐన్ స్టీన్ ఫొటోతో 'ఐన్‌‌స్టీన్ బ్రెయిన్'ను అమ్ముతున్నది. దీని ఒక్క యూనిట్ ధర 0.1 నుంచి ఒక యువాన్ వరకు ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 1 నుంచి రూ.12 మాత్రమే. వినడానికి వింతగా అనిపించినప్పటికీ 'ఐన్‌‌స్టీన్ బ్రెయిన్' ప్రొడక్టు‌‌ను కొనుగోలు చేసేవారికి సైంటిస్ట్ ఐన్‌‌స్టీన్ వంటి తెలివితేటలు వస్తాయని షాపింగ్ ప్లాట్‌‌ ఫారమ్  తెలిపింది. ఇందులో ఇంకో  ట్విస్ట్ ఏందంటే ఈ ప్రొడక్ట్ మెడిసిన్ కాదు, చిప్‌‌ కాదు. కేవలం వర్చువల్(చూడలేం, తాకలేం) ప్రొడక్ట్ అంట. 'మా ప్రొడక్ట్ వర్చువల్. దాన్ని కొన్న తర్వాత, మీరు స్మార్ట్ గా మారడానికి కాస్త టైం పడుతుంది. ఒక రాత్రి  తర్వాత, మీ తలలో ఐన్‌‌స్టీన్ బ్రెయిన్  పెరిగినట్లు మీరు గుర్తిస్తారు.' అని టావోబావో పోర్టల్ యాడ్ ఇచ్చింది. ఈ యాడ్ చూసి ఇప్పటికే 20 వేలకు పైగా కస్టమర్లు 'ఐన్‌‌స్టీన్ బ్రెయిన్' ప్రొడక్టు‌‌ను కొన్నరు. కొంతమందైతే రివ్యూలు కూడా రాశారు. 

ఖర్చులేకుండా విశ్వాసం పెంచుతది

“ఐన్‌‌స్టీన్ బ్రెయిన్ ప్రొడక్టు‌‌ సమర్థంగా పనిచేస్తున్నది. ఇది కొన్న తర్వాత  నేనో ఎగ్జామ్ రాశాను. అందులో అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు రాసేశాను" అని ఓ కస్టమర్  రివ్వూ ఇచ్చాడు. మరొక కస్టమర్ 'ఇది కొన్న తర్వాతే నేనో  వెర్రివాడినని తెలిసింది. ప్రొడక్ట్ బాగనే పనిచేసింది.’  అని అన్నాడు. మరికొందరు ఇదొక సిల్లీ ప్రొడక్ట్ అని తీసి పారేశారు. 

కాగా.. దీనిపై ఓ సైకలాజికల్ కన్సల్టెంట్ మాట్లాడుతూ..‘‘ఐన్‌‌స్టీన్ బ్రెయిన్ ప్రొడక్టు‌‌ భావోద్వేగాలను కంట్రోల్ చేయడానికి మాత్రమే. మనం ఐన్‌‌స్టీన్ అంత తెలివైన వారిమని నమ్మితే మనలో తెలియకుండానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలివైనవాడినని నమ్మినప్పుడే పరీక్షలు బాగా రాయగలం. మంచి మార్కులు కూడా వస్తాయి. ఈ ప్రొడక్ట్ తక్కువ ఖర్చుతో విశ్వాసాన్ని పెంచుకునే మార్గంగా భావించవచ్చు" అని పేర్కొన్నారు. చైనాలోని దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబాకు చెందిన టావోబావో .. ఆ దేశంలో ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్లలో ఒకటి.