అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేస్తే 30 డాలర్ల బిట్‌‌కాయిన్‌‌

అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేస్తే 30 డాలర్ల బిట్‌‌కాయిన్‌‌

న్యూఢిల్లీ: బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ను ప్రమోట్ చేయడానికి క్రిప్టో వాలెట్‌‌‌‌ను  ఓపెన్‌‌‌‌ చేసిన ప్రతి ఒక్కరికి 30 డాలర్ల విలువైన బిట్‌‌‌‌కాయిన్లను ఇస్తామని  ఎల్‌‌‌‌ సాల్వడర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్‌‌‌‌ కోసం మొత్తం 120 మిలియన్‌‌‌‌ డాలర్లను కేటాయించామని పేర్కొంది.  సుమారు 40 లక్షల బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ అకౌంట్లు లేదా వాలెట్లను  క్రియేట్ చేయడానికి మొత్తం 120 మిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించిందని ఎల్‌‌‌‌ సాల్వడర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అజెండ్రో జెలయా అన్నారు. కానీ, ఇంత మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం రాకపోవచ్చని  అభిప్రాయపడ్డారు. ఈ వాలెట్లకు ‘చివో’ అని ఎల్‌‌‌‌ సాల్వడర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పేరు  పెట్టింది. దీనర్ధం ‘కూల్‌‌‌‌’ లేదా ‘నైస్‌‌‌‌’ అని. బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌లో పేమెంట్స్‌‌‌‌ తీసుకోవడం తప్పనిసరి కాదని, వద్దనుకునే వాళ్లు ఈ క్రిప్టోను అంగీకరించాల్సిన అవసరం లేదని ఎల్‌‌ సాల్వడర్‌‌‌‌  చెబుతోంది.