
కరోనా దెబ్బకు ఎన్నో కుటుంబాలు, మరెన్నో జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తాజాగా కరోనా బారినపడి మృతి చెందిన తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న మృతిచెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మంచాల మండలం చిత్తపుర్ గ్రామానికి చెందిన జీలమోని అంజనేయులు (38) ఐదు రోజుల క్రితం కరోనాతో మృతిచెందాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న వెంకటేష్ బుధవారం హర్ట్ఎటాక్‌తో మరణించాడు. వారంరోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంజనేయులుకు భార్య, ముగ్గురు పిల్లలుండగా.. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
For More News..