పిచ్చండీ.. రీల్స్ పిచ్చి: సొంతంగా పెట్రోల్ కొట్టుకుంటూ ఓవ‌రాక్షన్​

పిచ్చండీ.. రీల్స్ పిచ్చి:  సొంతంగా పెట్రోల్ కొట్టుకుంటూ ఓవ‌రాక్షన్​

సోషల్​ మీడియాలో వైరల్​కావడానికి కొందరు చేస్తున్న పనులు పిచ్చికి పరాకాష్టలా మారుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు రీల్స్​కోసం పెట్రోల్​ని వృథా చేయడాన్ని వ్యతిరేకిస్తూ నెటిజన్లు ఏకిపారేశారు. ఉత్తర్​ప్రదేశ్​రాష్ట్రం నోయిడాకు చెందిన ఓ వృద్ధుడు తన కార్ లో పెట్రోల్​ కొట్టించడానికి  బంకుకి వెళ్లాడు. 

ఇంకేముంది బుర్రలో పురుగు తిరిగినట్టుంది..వెరైటీగా ఓ రీల్​ చేద్దామని అనుకున్నాడు. బంకు వాళ్లు పెట్రోల్​ కొట్టే బదులు వారి నుంచి పంపు లాక్కొని తన కారులో ఇంధనం నింపడం స్టార్ట్​చేశాడు. అంత వరకు బాగానే ఉన్నా.. అతను చేస్తుంది రీల్స్ కదా.. కొత్తదనం కోసం తలతిక్క పని చేయడం స్టార్ట్ చేశాడు. 

పంపు నుంచి వచ్చే పెట్రోల్​ని కింద పట్టడం స్టార్ట్​చేశాడు. దీంతో ఖరీదైన పెట్రోల్​ నేలపాలయింది. ఈ వీడియో కాస్త అతను అనుకున్నట్లే వైరల్​గా మారింది. కానీ పాజిటీవ్​గా కాదు నెగెటివ్​గా. రీల్స్ పిచ్చిలో పెట్రోల్​ వేస్ట్​చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

అతని పనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుని బంకు సిబ్బందితో క్లీన్​చేయించడం మరో ట్విస్టు. ఆ వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సోషల్​మీడియా వేదికగా కోరుతున్నారు.