క్రికెట్ మోడల్ లో పోల్ బెట్టింగ్

క్రికెట్ మోడల్ లో పోల్ బెట్టింగ్
  • కోడ్ లాంగ్వేజ్ తో పందేలు.. యాప్ లు, వాట్సాప్ తోనే దందా
  • లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ బెట్టింగ్ లు షురూ
  • అభ్యర్థుల గెలుపోటములు , మెజారిటీ, పార్టీల సీట్ల సంఖ్యపై పందాలు
  • కింది స్థాయి నాయకులు, కార్యకర్తలపై వల
  • రాష్ట్రంలో చేవెళ్ల, మల్కాజ్ గిరి లోక్ సభ సీట్లపై టాప్ బెట్టింగ్ లు
  • ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు

లోక్ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో మళ్లీ బెట్టింగులు జోరందుకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్ తో జోరుగా నడుస్తున్న దందాలో.. ఎలక్షన్లు కూడా భాగమైపోయాయి . పోలీస్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు..పార్టీల అభ్యర్థుల ఎంపి క దగ్గర్నుంచే పొలిటికల్ బెట్టింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండడంతో బుకీలు పోలింగ్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. దీంతో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగులు తప్ప పొ లిటికల్ బెట్టింగ్ ముఠాలు పోలీసులకు చిక్కలేదు. కానీ పోలింగ్ కు మరో ఐదు రోజులే గడువు ఉండడంతో బుకీలు బెట్టింగ్ లకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ద్వితీయ శ్రేణి కార్యకర్తలే టార్గెట్

క్రికెట్ బెట్టింగ్ తరహాలోనే అభ్యర్థులకు పోలయ్యే ఓట్ల దగ్గర్నుంచి గెలుపోటముల వరకు రకరకాలుగా పందేలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసిం ది. రాజకీయాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని సమాచారం. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ బుకీలు రాష్ట్రంలోని సబ్ బుకీలతో బెట్టింగ్ మొదలుపెట్టా రు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, పార్టీల బలాబలాలను సీనియర్ పొలిటీషియన్ల సహాయంతో విశ్లేషిం చుకుని.. ఆయా పార్టీలు, అభ్యర్థులపై గెలుపోటములపై పందేలు రెడీ చేస్తున్నట్టు తెలిసిం ది. దీనిపై సబ్ బుకీలు, ఏజెంట్లకు వివరాలు పంపి, ఏయే పార్టీలు, అభ్యర్థులపై ఎంతెంత పందాలు కాయాలన్నది చెబుతున్నట్టు సమాచారం.

కోడ్ బాషలో బెట్టింగ్

క్రికెట్ బెట్టింగ్ లో అనుభవం ఉన్న పంటర్లే ఈఎలక్షన్ల బెట్టింగ్ లో కీ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో పూర్తిగా ఆన్ లైన్ వెబ్ సైట్లలో , మొబైల్ యాప్స్, వాట్సాప్ అడ్డాగా బెట్టింగ్ లకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోం ది. పంటర్లు నిర్వహించే వాట్సాప్ గ్రూపుల్లో జరిగే బెట్టిం గ్ సమాచారం పోలీసులకు తెలిసే అవకాశాలు తక్కువ. దీంతో అప్పటికే తమ దగ్గరున్న బెట్టిం గ్ రాయుళ్ళ ఫోన్ నంబర్లతో అభ్యర్థులపై పందేలు పెడుతున్నా రు. పోలీసులకు చిక్కకుండా కోడ్ భాషలో బెట్టింగ్ సమాచారాన్ని షేర్చేస్తుం టారని, ఒక్కో పార్టీకి ఒక్కో కలర్, అభ్యర్థులకువివిధ రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల గుర్తులను పెడతారని తెలిసింది. పార్టీలు, అభ్యర్థులకు సంబంధించి డిమాండ్ ను బట్టి బెట్టింగ్ ప్రైస్​ నిర్ణయిస్తారు. బెట్టింగ్ రాయుళ్లు తాము సెలెక్ట్ చేసుకున్న పార్టీ, అభ్యర్థి, గెలుపోటములు, మెజార్టీ వంటి వాటిపై పందేల ఆధారంగా డబ్బును ట్రాన్స్​ఫర్ చేస్తారు.

15 వేల నుంచి 5 లక్షల దాకా..

నియోజకవర్గాన్ని బట్టి బెట్టింగ్ రేటు మారుతూ ఉంటుంది. రూ.15 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. దందా అంతా కీలక బుకీ ఆదేశాలతోనే జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. డిమాండ్ కు అనుగుణంగా అభ్యర్థుల గెలుపుపై పందేం రేట్లు మారుతూ ఉంటాయి. మొత్తంగా లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లపై కోట్లలో బెట్టింగ్ జరిగే అవకాశాలున్నట్టు అంచనా. హైదరాబాద్ అడ్డాగా సాగుతున్నబెట్టింగ్ దందాలో ప్రధానంగా చేవెళ్ల, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాలపైనే ఎక్కువగా పందేలు జరుగుతున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో మూడు కమిషనరేట్ల పోలీసులు బెట్టింగ్ ముఠాలపై ఫోకస్ పెట్టారు.