మళ్లీ అధికారంలోకి వస్తే.. మహిళలకు ప్రతి నెల రూ. 3 వేలు ఇస్తాం: కేటీఆర్‌

మళ్లీ అధికారంలోకి వస్తే.. మహిళలకు ప్రతి నెల రూ. 3 వేలు ఇస్తాం: కేటీఆర్‌

కరెంట్ లేని కాలరాత్రులు మనకు అవసరమా అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 నిమిషాలు కూడా కరెంట్‌ పోవట్లేదని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని.. 3 గంటల కరెంట్‌ చాలని రేవంత్‌ రెడ్డి అన్నారని విమర్శించారు. ఆడబిడ్డలకు మంచినీటి కష్టాలు తీర్చింది కేసీఆర్‌ అని తెలిపారు. 

డిసెంబర్‌ 3 తర్వాత గృహిణుల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం తెస్తామని కేటీఆర్‌ చెప్పారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ. 3 వేలు ఇస్తామన్నారు. 

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతు బంధును రూ. 16 వేలకు పెంచుతామన్నారు. అదేవిధంగా తెల్లరేషన్ కార్డులు ఉన్నవారందరికీ.. భూమి ఉన్నా లేకపోయినా.. రూ. 5 లక్షల జీవిత భీమా ఇస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేటలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.