ఎలక్షన్ కమిషన్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘నో యువర్ క్యాండిడేట్’ ఫీచర్

ఎలక్షన్ కమిషన్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘నో యువర్ క్యాండిడేట్’ ఫీచర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఓటర్లు తెలుసుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసీఐఎన్ఈటీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌("ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ యాప్)లో కొత్తగా ‘నో యువర్ క్యాండిడేట్(మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి)’ అనే ఫీచర్ ను చేర్చింది. 

ఈ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఎన్నికలో  పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, కేసులు వంటి పూర్తి వివరాలను ఓటర్లు తమ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తెలుసుకోవచ్చు. ఈ కొత్త  ఫీచర్ తో  ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటు వేసేందుకు అవకాశం కలగనుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.