పెండ్లిళ్లు ఎక్కువున్నయని పోలింగ్​ తేదీ మార్చేసిన్రు..

పెండ్లిళ్లు ఎక్కువున్నయని పోలింగ్​ తేదీ మార్చేసిన్రు..
  • కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 23కి బదులు నవంబర్ 25కి మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బుధవారం ప్రకటించింది. పొలిటికల్ పార్టీలు, సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్​లను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీఐ తెలిపింది. 

23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు ఉన్నాయని, ఈ కారణంగా సుమారు 25లక్షల మంది పోలింగ్​కు దూరమయ్యే చాన్స్ ఉందని ఈసీఐ భావించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పోలింగ్ తేదీని నవంబర్ 23కి బదులు అదేనెల 25వ తేదీకి మార్చినట్లు ఈసీఐ సెక్రటరీ సంజీవ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.