రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు

రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు గురువారం (నవంబర్23) జారీ చేసింది. రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

పనౌటీ పద ప్రయోగం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, జేబు దొంగ అంటూ ప్రకటనలు చేసినందుకు సమాధానం చెప్పాలని ఈసీ నోటీసులో కోరింది. నవంబర్ 25 సాయంత్రం 6 గంటలలోగా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

ప్రధానమంత్రిని జైబ్ కత్రా(పిక్ పాకెట్) గా పోల్చడం, పనౌటీ అనే పదాన్ని ఉపయోగించడం ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు తగదని బీజీపీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా తొమ్మిదేళ్ళలో మోదీ ప్రభుత్వం 14లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆధారాలు లేని ఆరోపణలు చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని పోల్ ప్యానెల్ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 25న ఎన్నికల  సంఘం ముందు రాహుల్ గాంధీ హాజరు కావాలని కోరింది.