సస్పెండైతే ఎవరూ పట్టించుకోరు: ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌

సస్పెండైతే ఎవరూ పట్టించుకోరు: ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌

ముషీరాబాద్, వెలుగు: ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులపై అధికారులు ఫోకస్ పెట్టాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సెగ్మెంట్  పీవో, ఏపీవో పోలింగ్ సిబ్బందికి దోమలగూడలోని ఏవీ కాలేజీలో శిక్షణ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ..  ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాసులు ఆషామాషీగా తీసుకోవద్దన్నారు.  

పోలింగ్ డే సందర్భంగా పీఓలు తీసుకోవాల్సిన చర్యలు బాధ్యతపై క్లుప్తంగా వివరించారు.  ఎన్నికల సమయంలో సస్పెండ్ చేస్తే ప్రభుత్వం కూడా పట్టించుకోదన్నారు.  ఓటరు పేరు ఉంటేనే లోనికి రానివ్వాలన్నారు. ఓటర్  స్లిప్ ఐడీ కాదని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12 ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.