జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించరాదని, ఎన్నికలను పాదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్, జిల్లా ఎలక్షన్ అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.
మంగళవారం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పైన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు, తహసీల్దార్లతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్నితిన్, ఎంసీసీ నోడల్ ఆఫీసర్విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

