
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా జిల్లాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి.
మరోవైపు.. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 70.48శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 20.09 శాతం నమోదైంది.