బండ్లు ఆపితే చాలు : తెలంగాణలో పట్టుబడిన ఎలక్షన్ సొమ్ము రూ.518 కోట్లు

బండ్లు ఆపితే చాలు : తెలంగాణలో పట్టుబడిన ఎలక్షన్ సొమ్ము రూ.518 కోట్లు

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజైనప్పటి(అక్టోబర్ 9 నుంచి) నుంచి 2023 నవంబర్ 07 వరకు  రూ.518 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ మేరకు తెలంగాణ ఎన్నికల  ప్రధాన అధికారి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.  

ఇందులో  రూ.177 కోట్లకు పైగా నగదు, 292 కిలోల బంగారం, 1,168 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులు రూ. 178 కోట్లకు పైగా, రూ. 66 కోట్ల విలువైన మద్యం, రూ. 30.7 కోట్ల విలువైన గంజాయి, రూ. 66 విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది.   

పోలింగ్‌కు మరో 21 రోజుల టైమ్‌ ఉండటంతో ఇది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కా గా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.  డిసెంబర్ 03న ఫలితాలు వెల్లడించనున్నారు .