హైదరాబాద్​ రోడ్లపై త్వరలో తిరగనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్​ రోడ్లపై త్వరలో తిరగనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

10 బస్సులు అద్దెకు తీసుకొని నడుపనున్న ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. తొలుత  10 బస్సులను అద్దెకు తీసుకుని మూడు రూట్లలో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకు వారంలో టెండర్లు పిలవనుంది. డబుల్ డెక్కర్ బస్సులు కొనేందుకు నిధుల కొరత ఉండడంతో అద్దెకు తీసుకొని నడపాలని అధికారులు నిర్ణయించారు. 

ఫ్లైఓవర్లు లేని రూట్‌‌‌‌లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే  చాన్స్​ ఉంది.  పటాన్‌‌‌‌చెరు -కోటి, జీడి మెట్ల– సీబీఎస్, అఫ్జల్‌‌‌‌గంజ్–-మెహదీపట్నం రూట్లలో ఈ బస్సులను నడుపనున్నట్లు సమా చారం. హైదరాబాద్​లో 1990 టైమ్​లో ఈ బస్సులుండేవి. మళ్లీ వాటిని హైదరాబాద్​లో ప్రారంభించాలని గతంలో పలువురు ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్  కోరారు. ఈ నేపథ్యంలోనే -డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని సర్కారు నిర్ణయించి ఆర్టీసీకి బాధ్యతలు అప్పగించింది.