మీ వీసా రిజెక్ట్ అయ్యిందా: డోంట్ వర్రీ.. మళ్ళీ ఇలా ప్రయత్నిస్తే ఈజీగా వస్తుంది..

మీ వీసా రిజెక్ట్ అయ్యిందా: డోంట్ వర్రీ..  మళ్ళీ ఇలా  ప్రయత్నిస్తే ఈజీగా వస్తుంది..

ఫారెన్ వెళ్లాలని కలలు కని, టికెట్లు బుక్ చేసుకొని.. అంతా రెడీ చేసుకున్నాక... మీ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయితే.. మనసుకు ఎంత కష్టంగా  ఉంటుందో... ఇక నా ఫారెన్ కల అయిపోయినట్లేనా అని బాధపడకండి. వీసా రిజెక్ట్ అయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు. చాలాసార్లు చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు వల్ల కూడా వీసాలు రిజెక్ట్ ఆవుతాయి.. ఈ పొరపాట్లు మళ్ళి జరగకుండా చుసుకుంటే మళ్లీ ప్రయత్నించే ఛాన్స్ ఉంటుంది.

వీసా ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే : వీసా అప్లికేషన్ ఫామ్ లో  చిన్న అక్షరం తప్పు ఉన్న, సంతకం మర్చిపోయిన లేదా వివరాలు నింపక పోయినా సరే.. రిజెక్ట్  చేస్తారు. అందుకే ప్రతిది రెండు, మూడు సార్లు చెక్ చేసుకోవాలి. 

#మీ బ్యాంక్ అకౌంట్లో సరిపడా డబ్బు లేకపోయిన లేదా ట్రాన్సక్షన్స్ సరిగా లేకపోయిన...  ప్రయాణ ఖర్చులు భరించగలరా లేదా అని కూడా అనుమానంతో రిజెక్ట్ కావొచ్చు. అందుకే స్థిరమైన ఆదాయం చూపించాలి. 

#మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో అంటే హోటల్ బుకింగ్స్, ఏం చేయబోతున్నారో వివరంగా చెప్పలేకపోతే అనుమానం వస్తుంది. అందుకే మీ జర్నీ ప్లాన్ స్పష్టంగా ఉండాలి.

►ALSO READ | బెంగళూరులో బైకర్‌ని చెంపదెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. దెబ్బకు సస్పెండ్..

#మీకు ఇక్కడ మంచి ఉద్యోగం, ఆస్తి లేదా కుటుంబ బాధ్యతలు ఉన్నాయని రుజువు చేయకపోతే, మీరు ఫారెన్లోనే ఉండిపోతారేమో అని ఆలోచనతో రిజెక్ట్ చెయ్యొచ్చు.  దీనికి కూడా  సొంత దేశానికి తిరిగి వచ్చేందుకు  గట్టి కారణాలు చూపాలి.

#పాస్‌పోర్ట్ గడువు ఆరు నెలల్లో అయిపోతున్న లేదా చినిగిపోయిన పేజీలు ఉంటే రిజెక్ట్ చేస్తారు. అందుకు ముందే పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేయించుకోవాలి. 

వీసా రిజెక్ట్ అయితే వెంటనే ఎం చేయాలి:

#ముందుగా, మీకు వచ్చిన రిజెక్షన్ లెటర్ చదివి, మీ వీసా ఎందుకు రిజెక్ట్ అయిందో కారణం అందులో స్పష్టంగా ఉంటుంది. ఫలానా డాక్యుమెంట్ లేదు లేదా ఆర్థిక పరిస్థితి కరెక్ట్ లేదు అని రాసి ఉంటే దీనికి అసలు కారణం ఏంటో తెలుసుకోండి.

 #కొన్ని దేశాలు వీసా రిజెక్ట్  చేస్తే  మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తాయి. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే, అప్పీల్ చేయడానికి గడువు తేదీని తెలుసుకుని అప్లయ్ చేసుకోవచ్చు. 

#మొదటిసారి ఏదైనా కారణంతో రిజెక్ట్ చేస్తే దానిని సరిచూసుకోండి. డబ్బు లేదంటే, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ట్యాక్స్  పేపర్స్ చూపించండి.  
 
#మీరు ఖచ్చితంగా  ఇండియాకి  తిరిగి వస్తారని నమ్మకం కలిగించాలి. అందుకే, మీ ఉద్యోగ పేపర్స్, ఆస్తి డాక్యుమెంట్లు, మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు లేదా విద్యార్థి అయితే మీ కాలేజీ/స్కూల్ సర్టిఫికెట్లను బలంగా చూపించండి.

 #పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలలు వాలిడిటీ  ఉందొ లేదో చూడండి. మీరు గతంలో ఎప్పుడైనా వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పి, దానికి వివరణ ఇవ్వండి. అవసరమైన వాక్సీన్స్, మీ హెల్త్  డాకుమెంట్స్ ఉంటే వాటిని కూడా రెడీ  చేసుకోండి.

#డాక్యుమెంట్ల విషయంలో ఏమాత్రం తప్పు సమాచారం ఇవ్వొద్దు. మీ పేరు, తేదీలు, అడ్రస్ అన్ని డాకుమెంట్స్ లో కూడా ఒకేలా ఉండాలి. మీ పాత వీసా రిజెక్షన్  ఏమైనా ఉంటే దాచిపెట్టకుండా చెప్పండి.  

అన్ని చేసినా కూడా మళ్లీ రిజెక్ట్ చేస్తే, వెంటనే మళ్లీ  అప్లయ్ చేయవద్దు. ఒకటి-రెండు నెలలు ఆగి, ఏది సరిగా లేదో తెలుసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం, కొత్త డాక్యుమెంట్స్ సేకరించడం వంటివి చేయండి. మళ్లీ అప్లయ్ చేసేటప్పుడు, మీరు పాత సమస్యలను ఎలా పరిష్కరించారో వివరిస్తూ ఒక మంచి కవర్ లెటర్ రాయండి. అన్ని రెడీ చేసిన సెకండ్ వీసా అప్లికేషన్ ఎక్కువగా సక్సెస్ ఆయ్యే ఛాన్స్ ఉంటుంది. 

వీసాకు కావాల్సిన డాకుమెంట్స్ లిస్ట్:
* బ్యాంక్ స్టేట్‌మెంట్లు, జీతం స్లిప్‌లు, ట్యాక్స్ రిటర్నులు (IT Returns).
*జాబ్ అఫర్  లెటర్, నో అబ్జాక్షన్ లెటర్(NOC) 
*ఎక్కడికి వెళ్తారో చెప్పే ప్లాన్, హోటల్ రిజర్వేషన్లు, రిటర్న్ జర్నీ ఫ్లయిట్ టిక్కెట్.
*బంధువులు లేదా వ్యాపార సంస్థల నుంచి ఇన్విటేషన్ లెటర్( ఒకవేళ ఉంటే).
*ఇల్లు, పొలం డాక్యుమెంట్లు లేదా అగ్రిమెంట్ పేపర్స్.
*పాత, కొత్త పాస్‌పోర్ట్ కాపీలు, పాత వీసాల కాపీలు.
*మీరు ఎందుకు వెళ్తున్నారో, ఎంత కాలం ఉంటారో, డబ్బు ఎలా అడ్జస్ట్ చేసుకున్నారో  చెప్పే ఒక చిన్న లెటర్.