
శ్రీశైలం శైవ క్షేత్రంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొద్దిసేపు ధ్యానం చేసిన మోదీ.. ఆ తర్వాత శివయ్య దర్శనం చేసుకున్నారు. 2025, అక్టోబర్ 16వ తేదీ ఉదయం శ్రీశైలం వచ్చిన ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు సంప్రదాయ బద్దంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ప్రధాని హోదాలో మోదీ శ్రీశైలం రావటం ఇదే మొదటిసారి. గతంలో కేవలం నలుగురు ప్రధాన మంత్రులు మాత్రమే శ్రీశైలం వచ్చారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ, ఇందిగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు శ్రీశైలం సందర్శించారు. ఆ తర్వాత మోదీ మాత్రమే ప్రధానిగా శివయ్య దర్శనం చేసుకున్నారు.
ప్రధాని మోదీ సంప్రదాయ దుస్తుల్లోనే స్వామి వారిని దర్శనం చేసుకోవటం విశేషం. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. శివయ్య దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత మిగతా దేవుళ్లను దర్శనం చేసుకున్నారు.
భూమికి నాభి కేంద్రంగా శ్రీశైలం ఉందని పురాణాలు చెబుతున్నాయి. నాభి క్షేత్రంగా శివుడు కొలువైన పవిత్ర క్షేత్రం శ్రీశైలం.