
ఏడాదంతా పటాకుల తయారీలో మునిగిపోయే కార్మికుల శ్రమ ఆకాశంలో వెలిగే రోజు దీపావళి.ఆ కార్మికుల నవ్వులు మన ముంగిళ్లలో 'ఢాం ఢాం' అంటూ పేలే రోజిది. ఊరూరూ చేరి ఊరందరినీ మురిపించే పటాకుల పుట్టిల్లు శివకాశీ. పటాకులే జీవితంగా బతికే కార్మికుల ప్రపంచం అది.
దీపావళి రాత్రి పటాకుల మోతతో సంబురం అంబరాన్నంటుతుంది. ఆకాశాన్ని వెలిగిచే తారాజువ్వలు.. నలు దిక్కులా మోతమోగించే పటాకులు, దీపాల లోగిళ్లను వెలిగించే మతాబులు అందరినీ సంతోషాల వెలుగుల్లో విహరింపజేస్తాయి. ఈ పండుగ ఆనందం కొన్ని గంటలే. దేశమంతా ఉత్సాహంగా జరుపుకునే ఆ కొన్ని గంటల ఉత్సవం కోసం లక్షల మంది కార్మికులు 300 రోజులూ పరిశ్రమించే క్షేత్రం
శివకాశీ పటాకుల పుట్టిల్లు : శివకాశీ పట్టణాన్ని పాండ్య రాజు హరికేసరి పరాక్రమ పాండ్యన్ పాలనా కాలంలో (15వ శతాబ్దంలో) నిర్మించారు. వందల ఏళ్లుగా దేశీయ పటాకుల మార్కెట్లో శివకాశీ పట్టణం తారాజువ్వలా దూసుకుపోతోంది. కారణం ఈ పట్టణం పటాకుల ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది. ఏడాదిలో తక్కువ రోజులు వర్షాలుంటాయి. మబ్బులు లేకుండా ఎండ ఉండే రోజులే ఎక్కువ. గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఈ అనుకూ లతతో శివకాశీ పట్టణం పటాకుల మార్కెట్లో భూ'చక్రం తిప్పుతోంది'.
ప్రస్తుతం శివకాశిలో ఏ వీధిలో చూసినా పటాకులు, అగ్గిపెట్టెల పరిశ్ర మలో పనిచేసే కార్మికుల నివాసాలే ఉంటాయి. నివాస సముదాయాలకు దూరంగా ఉండే కుటీర, భారీ పరిశ్రమలను ఆశ్రయిస్తూ లక్షలాది శ్రమజీవులు ఈ పట్టణంలో జీవితం సాగిస్తున్నారు. ఫైర్ వర్క్స్, అగ్గిపెట్టెలు, ప్రింటింగ్ పరిశ్రమలకు పేరుగాంచినది. ఈ మూడు రంగాలే ఈ ప్రాంత కార్మికులకు ప్రధాన ఉపాధి.
వార్ ఫర్ : శివకాశీలో 20వ శతాబ్ధ ఆరంభంలో ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ మొదలైంది. శివకాశిలో తొలినా ళ్లలో అగ్గిపెట్టెల తయారీ కోసం కుటీర పరిశ్రమ లు వెలిశాయి. ఆ తర్వాత కాలంలో పటాకుల తయారీ, ఎగుమతులతో ఈ పట్టణం భారత దేశంలో ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకుంది.
శి వకాశిలో 1923లో అగ్గిపెట్టెలు తయారు చేసే కుటీర పరిశ్రమలు ఒకటీ రెండు ఉండేవి 1942 నాటికి వీటి సంఖ్య మూడుకు పెరిగింది. ఈ పట్టణంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు 1934లో బీజం పడింది. 1942 నాటికి శివకాశీ పట్టణంలో నేషనల్ ఫైర్ వర్క్స్, కాలీశ్వరి ఫైర్ వర్క్స్ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ సంస్థలు మన దేశ మార్కెట్లో మంచి పేరు గడించాయి.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శివకాశీ పైర్ వర్క్స్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. 1938 నుంచి 1944 మధ్య కాలంలో యుద్ధానంతరం ఈ మార్కెట్ ఊపం దుకుంది. మరుసటి ఏడాది నుంచి ఏడాదికి పది కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
జనాభాకు మూడు రెట్లు : దేశ స్వాతంత్ర్యానంతరం రవాణా మార్గాల అభి వృద్ధితో శివకాశీ ఉత్పత్తులు దేశం నలుమూల లకు విస్తరించాయి. దీపావళి వచ్చిందంటే ప్రతి ఊరికీ శివకాశీ ఉత్పత్తులు చేరే స్థాయికి ఆ పరి శ్రమ ఎదిగింది. 1980 నాటికి 189పరిశ్రమలు న్నాయి. 2001 నాటికి శివకాశిలోనే పటాకులు, అగ్గిపెట్టెల పరిశ్రమల సంఖ్య 450కి పెరిగింది. 2011 జనాభా గణన ప్రకారం. శివకాశీ జనాభా 71 వేలు. ఈ పట్టణం ఉపాధి కల్పించే కార్మికుల సంఖ్య 2.50 లక్షలు. ఏడాదికి 20 బిలియన్డాలర్ల టర్నోవర్ జరుగుతోంది.. ప్రస్తుతం వేలాది కంపెనీలు ఉన్నాయి.
పటాకుల సైన్యం : పటాకుల తయారీ అంటే నిప్పుతో చెలగాటం లాంటిది. ఇది బరువైన పని. కష్టమైన పని. ఈ రెంటికీ మించి ప్రమాదం పొంచి ఉండే పని. 'రేపు' అనే ఆలోచన లేకుండా ఈ రోజు.. కాదు ..కాదు 'ఇప్పుడు' చేయాల్సిన పనుల గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పటాకుల తయారీ అంటే నిప్పుతో చెలగాటమే. పొంచి ఉండే ప్రమాదానికి భయపడకుండా పనిలో భాగస్వామ్యం కావడం ఈ సాహస కా ర్మికుల పరాక్రమానికి నిదర్శనం.
నిత్యం మందుగుండుతో పటాకులు, మతాబులు తయారు చేయడం ఓ సాహస కళ, వివిధ వయసుల వాళ్లను అలరించడానికి కన్నుల పండువగా పూల వాన కురిపించే మతాబులెన్నింటినో ఈ కార్మికులు మనకు అందిస్తున్నారు. వాకిళ్లలో పూలవాన కురిపించే చిచ్చుబుడ్లు, గిరగిర తిరుగుతూ వాకిలిని వెలుగు రేఖలతో దివ్వెల ముగ్గులా అలంకరించే భూచక్రాలు, సురసురము ని కాలుతూ చిటపటలాడే మిణుగురుల్ని వదిలే కాకరవత్తుల తయారీలో వీళ్ల సృజన ఎప్పడూ లెక్కతప్పుడు ఇది ఇంజనీరింగ్ స్కిల్స్ కన్నా కార్మి కుడి నైపుణ్యంపై ఆధారపడిన పరిశ్రమ. అందుకే ప్రపంచీకరణ దెబ్బకు కుటీర పరిశ్రమలన్నీ కొట్టుకుపోయినా శివకాశీ మాత్రం దినదినమూ వర్ధిల్లుతూనే ఉంది. దేశంలో యాంత్రీకరణ పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గినా శివకాశీ పట్టణంలో మాత్రం ఆ పరిశ్రమ సాహనం, సృజన వున్న కార్మి కుల్ని ఆదరిస్తూనే ఉంది. పనికి, ప్రతిభకు ఆదరణ వున్న పరిశ్రమ ఇది
వెలగని దివ్వలు
దేశమంతా దీపావళి గిప్టుల పేరుతో స్వీట్లు పంచుకుంటున్నారు. ఆఫర్లతో బట్టల షాపులు ఆకట్టుకుంటుంటే మతాబుల కాంతిలో ఇళ్లన్నీ వెలిగిపోతున్నాయి.కానీ శివకాశిలో ఈ పరిస్థితి లేదు. ఏడాదంతా తయారు చేసిన ఉత్పత్తులన్నీ అమ్ముడుపోయే దీపావళికి పెద్ద మొత్తంలో లాభాలు కూడగట్టుకునే సంస్థలు కార్మికులకు బోనస్ గా ఆ లాభాన్ని కొంతైనా ఇవ్వట్లేదు.
మిణుగురుల మెరుపులు..
శివకాశీ నాణ్యతకు మరో పేరు. ఈ పట్టణంలో తయారయ్యే ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతి కావడానికి కారణం ఇదే. మిణుగురుల్లా వెలుగుతూ చీకటిలో మిరుమిట్లు గొలిపే శివకాశీ కాకర వత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ తయారైన కాకరవత్తులు యూకే, జర్మనీ దేశాలకు భారీ మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు.