Kantara Chapter 1: దీపావళికి రిషబ్ శెట్టి ట్రీట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'కాంతార చాప్టర్ 1' కొత్త ట్రైలర్!

Kantara Chapter 1: దీపావళికి రిషబ్ శెట్టి ట్రీట్..  గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'కాంతార చాప్టర్ 1'  కొత్త ట్రైలర్!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ 'కాంతార చాప్టర్1 ' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.  అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. బాలీవుడ్ చిత్రాలను సైతం బోల్తొ కొట్టిస్తూ దూసుకెళ్తోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. 'కాంతార'కు  ప్రీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ..  ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా  ఇప్పటి వరకు రూ. 675 కోట్లకు పైగా వసూళ్లును రాబట్టింది.

ఈ చిత్రం భారీ విజయాన్ని పురస్కరించుకుని మూవీ మేకర్స్ .. దీపావళి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకను అందించింది. లేటెస్ట్ గా కాంతార చాప్టర్ 1 నుంచి కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలు, ఉత్కంఠభరితంతో కూడిన  ఘాట్టాలతో కలిపి కొత్త ట్రైలర్ ను రూపొందించి..  విడుదల చేసింది. ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంపొందించేలా .. ఆకట్టుకుంటోంది.