
టీవీఎస్ మోటార్స్ తొలిసారిగా భారత మార్కెట్లోకి ఒక అడ్వెంచర్ బైక్ మోడల్ లాచ్ చేసింది. అపాచీ RTX 300 అడ్వెంచర్ బైక్ 2025 అక్టోబర్ 15న ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. యువతను ప్రస్తుతం టీవీఎస్ అడ్వెంచర్ టూర్ బైక్ ఆకట్టుకుంటోంది. ఈ బైక్‌లో TVS Next-Gen RT-XD4 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి 299.1 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ కలిపింది.
ఈ బైక్ 36 PS పవర్, 28.5 Nm టార్క్ అందిస్తోంది. బైక్ లో 6- స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 19/17 అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఇక డిజైన్ పరంగా ముందున్న ట్విన్ LED హెడ్లైట్స్, LED టెయిల్ లైట్స్, స్పోర్టీ మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాగ్, అద్భుతమైన ట్రాన్స్‌పరెంట్ విండ్షీల్డ్ తో ఆకట్టుకుంటుంది. ఇక బండిలో అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ వంటి నాలుగు రైడింగ్ మోడ్స్ ఉండటం గమనార్హం.
►ALSO READ | Ola Shakti: ఎనర్జీ స్టోరేజ్ వ్యాపారంలోకి ఓలా ఎలక్ట్రిక్.. కొత్తగా ఓలా శక్తి లాంచ్..
టీవీఎస్ తన కొత్త బండిలో ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానెల్ ABS, క్రూజ్ కంట్రోల్ వంటి ఆధునిక సౌకర్యాలను జోడించింది. TVS SmartXonnect సిస్టమ్ ద్వారా మొబైల్ కనెక్టివిటీ, కన్సోల్ ద్వారా అనేక డేటా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం టీవీఎస్ లాంచ్ చేసిన ఈ బైక్.. అడ్వెంచర్ టూర్ సెగ్మెంట్‌లో KTM 250 అడ్వెంచర్ వంటి బైకులతో పోటీ పడుతోంది. ప్రస్తుతం బైక్ రేటు రూ.లక్ష 99వేల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ వెల్లడించింది.
మొత్తం చూసుకుంటే కొత్త టీవీఎస్ అపాచీ RTX 300 ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, సూపర్ లుక్స్ కలిగిన యువత ఇష్టపడే అడ్వెంచర్ టూర్ బైక్. అడ్వెంచర్ ప్రేమికులకు ఎంచుకునే ఉత్తమ ఎంపికగా నిలబడనుందని కంపెనీ అభిప్రాయపడుతోంది.