ఐదేండ్లలో పరిశ్రమలకు క్రాస్ సబ్సిడీ కట్!..విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2025 డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

ఐదేండ్లలో పరిశ్రమలకు క్రాస్ సబ్సిడీ కట్!..విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2025 డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
  •     సంస్థలు, నిపుణుల అభిప్రాయాల స్వీకరణకు 30 రోజుల గడువు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2003 విద్యుత్ చట్టంలో కీలక సవరణలు చేసేందుకు 'విద్యుత్ చట్ట (సవరణ) బిల్లు -2025' డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వివిధ శాఖలు, సంస్థలు, నిపుణుల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పరిశ్రమలు, రైల్వేలు, మెట్రోలకు సంబంధించిన క్రాస్ సబ్సిడీలను ఐదేండ్లలోపు పూర్తిగా తొలగించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.

 తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  జారీ చేసిన లేఖలో ఈ వివరాలు వెల్లడించింది. డ్రాఫ్ట్ బిల్లును కేంద్రీయ విద్యుత్ నియంత్రణ కమిషన్ (సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ), రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే బోర్డు, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ తదితర సంస్థలకు పంపించి.. అభిప్రాయాలు కోరింది. "విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసి, మార్కెట్ ఆధారిత వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఈ సవరణలు అవసరం" అని లెటర్​లో పేర్కొంది. 

సూచనలు r1-mop@gov.in కు ఈ మెయిల్ ద్వారా పంపాలని సూచించింది. ఈ డ్రాఫ్ట్ బిల్లు ప్రధాన అంశాల్లో  విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలకు ఓపెన్ యాక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత సులభతరం చేయడం, టారిఫ్ నిర్ణయంలో సుమోటో అధికారాలు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వడం, సైబర్ సెక్యూరిటీ అవసరాలు చేర్చడం లాంటి మార్పులను ప్రతిపాదించారు. 

ఖర్చులను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచుతుంది..

ముఖ్యంగా.. రైల్వే, మెట్రో రైళ్లు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ఇచ్చే క్రాస్ సబ్సిడీలను 2025 నుంచి ఐదేండ్లలోపు పూర్తిగా తొలగించాలని ఈ బిల్లు సూచిస్తోంది. ఇది పరిశ్రమలకు విద్యుత్ ఖర్చులను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, నాన్-ఫాసిల్ ఎనర్జీ వనరుల (సౌర, పవన విద్యుత్) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కనీస శాతాన్ని నిర్దేశించాలని కేంద్రం సూచించింది. అనధికారిక విద్యుత్ వినియోగంపై జరిమానాలు మరింత కఠినతరం చేయడం, అప్పీల్ ప్రక్రియలో సరళీకరణలు కూడా ఉన్నాయి. 

కాగా, విద్యుత్ రంగ నిపుణులు ఈ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాగతిస్తున్నారు. "ఈ సవరణలు విద్యుత్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుస్తాయి. ముఖ్యంగా పరిశ్రమలకు ఇది వరంగా మారుతుంది" అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలు ఈ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఎందుకంటే క్రాస్ సబ్సిడీల తొలగింపు సామాన్య వినియోగదారులపై భారం పడుతుందని  భావిస్తున్నాయి. ఈ డ్రాఫ్ట్
 
బిల్లు పూర్తి వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయి. సూచనలు స్వీకరించిన తర్వాత బిల్లును సవరించి, పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఇది అమలులోకి వస్తే, భారత విద్యుత్ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.