 
                                    హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు విచారణకు దిగారు. సరైన పత్రాలు లేకుండానే విచ్చలవిడిగా కరెంట్ మీటర్లు వాడుతున్నారని.. . జీహెచ్ఎంసీ నుంచి ఓసీ ఇవ్వకుండానే అక్రమంగా కనెక్షన్లు ఇచ్చారని అధికారుల దృష్టికి వచ్చింది. విద్యుత్ కనెక్షన్ల విషయంలో విద్యుత్ శాఖ అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
సుప్రీంకోర్టు ఆర్డర్ సైతం బేఖాతరు చేసిన విద్యుత్ అధికారులు మీటర్లు ఇచ్చేందుకు లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లైన్ మెన్ల నుంచి ఎస్ ఈ స్థాయి అధికారుల వరకు పాత్రధారులు ఉన్నారని సమాచారం. ఒక్కో స్తంభానికి, ట్రాన్స్ ఫార్మర్లకు ఇంత అంటూ రేట్ కట్టి.. మీటర్ల మంజూరుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తేలింది.. నిర్మాణదారులు అఫిడవిట్ ఇచ్చారంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు విద్యుత్ అధికారులు .
ALSO READ : సికింద్రాబాద్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
అయ్యప్ప సొసైటీలో కొనసాగుతోన్న విజిలెన్స్ అధికారుల విచారణలో విద్యుత్ అధికారుల డొంక కదులుతోంది. బడా బిల్డర్ల కోసం విద్యుత్ సిబ్బంది అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా అంతస్థుకు ఒక రేటు తీసుకుంటూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయ్యప్ప సొసైటీ అక్రమాలపై త్వరలో జీహెచ్ఎంసీలో కూడా విజిలెన్స్ విచారణకు అవకాశం ఉంది.

 
         
                     
                     
                    