సికింద్రాబాద్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

సికింద్రాబాద్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

సికింద్రాబాద్ లో   గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గోపాలపురంలో  మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. టీ స్టాల్ నిర్వాహకుడిపై దాడికి చేశారు. రోడ్డుపై ఒకరినొకరు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై  చుట్టు ప్రక్కల ప్రజలను  భయబ్రాంతులకు గురి చేశారు.  గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న యువకులు రోడ్డుపై కుమ్ములాటకు దిగారు. మధ్యలోకి వెళ్లిన వారిని సైతం యువకులు దాడి చేశారు.   బాధితుడి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు.  

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టు పక్కల నిత్యం ఆకతాయిలు గొడవలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్ పై  పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

►ALSO READ | 510 కిలోల డెడ్ లిఫ్ట్ తో అతని రికార్డ్ అతడే బద్దలుకొట్టాడు.. ఈ నటుడు ఎవరంటే.. ?

 హైదరాబాద్ లో ఓ వైపు ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈగల్ టీం ను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయిని అరికడుతోంది. ఎక్కడిక్కడ ఈగల్ టీం అంతరాష్ట్ర డ్సగ్స్ ముఠాలను పట్టుకుంటోంది.