
గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో ది మౌంటెన్ క్యారెక్టర్ తో ప్రసిద్ధి చెందిన హఫ్థోర్ బోర్న్ సన్ డెడ్ లిఫ్ట్ లో ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఇదివరకు 505 కిలోలతో అతని పేరు మీద ఉన్న రికార్డ్ అతనే బద్దలు కొట్టాడు బోర్న్ సన్. స్వతహాగా అథ్లెట్ అయిన ఐస్లాండిక్ నటుడు బర్మింగ్ హాంలో జరిగిన స్ట్రాంగ్ మ్యాన్ 2025 పోటీల్లో 510 కిలోల ( 1,124 పౌండ్లు ) ఎత్తి తన రికార్డ్ తానే బద్దలు కొట్టాడు. డెడ్ లిఫ్ట్ లో తన అద్భుత ప్రతిభతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు బోర్న్ సన్.
2018లో తన ప్రీవియస్ రికార్డ్ 505 కిలోలు ఎత్తి ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తిగా రికార్డ్ సాధించాడు బోర్న్ సన్. 510 కిలోల భారీ బరువును ఎత్తే సమయంలో బోర్న్ సన్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. ఈ డెడ్ లిఫ్ట్ చాలా సులువుగా ఎత్తగలిగాడు బోర్న్ సన్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ALSO READ : 8 ఏళ్ళ తర్వాత ఆసియా కప్ సొంతం..
510 కిలోల బరువు తన మాగ్జిమమ్ కెపాసిటీ కాదని.. ఇది ప్రాక్టీస్ తో సాధ్యమైందని అన్నాడు బోర్న్ సన్. 510 కిలోల బరువు అంత తేలికైనదా.. ? అంటూ నెటిజన్స్ చేసిన కామెంట్ కి బదులిస్తూ.. ఈ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని చెబుతూనే.. బరువును ఎంచుకోవడంలో ఉన్న టెక్నీక్స్ ను వివరించాడు బోర్న్ సన్.