హైదరాబాద్ నాగోల్ లో స్కూల్ ముందు తెగిపడిన కరెంటు వైర్లు...

హైదరాబాద్ నాగోల్ లో స్కూల్ ముందు తెగిపడిన కరెంటు వైర్లు...

హైదరాబాద్ నాగోల్ లో ఘోర ప్రమాదం తప్పింది. నాగోల్ లోని సాయినగర్ కాలనీలో కరెంటు వైర్లు ప్రమాదకరంగా మారాయి.. శుక్రవారం ( నవంబర్ 7 ) స్థానిక  శ్రీ సాయి చైతన్య  స్కూల్ ముందు కరెంటు వైర్లు తెగిపడ్డాయి. స్కూల్ టైం అవ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ విషయంపై సమాచారం ఆనించినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఈ సమస్య పరిష్కారం అయ్యేలా స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్. స్కూల్ బయట సిబ్బందిని పెట్టి వచ్చి పోయేవారిని అలర్ట్ చేస్తోంది యాజమాన్యం.

కరెంటు వైర్లు తెగిపడ్డాయని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించామని.. అధికారులకు నుంచి ఎలాంటి  స్పందన లేదని తెలిపింది స్కూల్ యాజమాన్యం. ఈ రోడ్డులో నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని.. పైగా స్కూల్ ముందే వైర్లు తెగిపడటంతో పిల్లలను పంపాలంటే భయంగా ఉందని అంటున్నారు స్థానికులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.