రాష్ట్రంలో ఈ– సిగరెట్లపై బ్యాన్: అమ్మితే కఠిన చర్యలు

రాష్ట్రంలో ఈ– సిగరెట్లపై బ్యాన్: అమ్మితే కఠిన చర్యలు

ఈ– సిగరెట్ల అమ్మకాలపై బ్యాన్

అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం: డీజీపీ

ఈ సిగరెట్ల అమ్మకాలపై బ్యాన్​ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు డీజీపీ మహేందర్​రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీటి క్రయ విక్రయాలపై దృష్టి సారించాలంటూ పోలీసులను అలర్ట్​ చేశారు. ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి ఈ -సిగరెట్ ఉత్పత్తులు, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, సప్లై, స్టాక్ నిల్వ, ప్రకటనలపై నిఘా పెట్టారు. ఈ సిగరెట్లు, ఈ -హుక్కా  స్టాక్ హోల్డర్లు, షాపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న స్టాక్​ను పోలీసులకు అప్పగించాలని వార్నింగ్​ ఇచ్చారు. ఈ సిగరెట్ల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించాలంటూ స్కూల్స్, కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థల యాజమాన్యాలకు డీజీపీ సూచించారు.